
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి కోవింద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతికి వివరించనున్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే.