
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఇంకొల్లు: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉంటాయి. అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు స్టాలిన్‌పేటకు చెందిన దుడ్డు పున్నయ్య ఇంట్లో నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. విడికాళ్ల జాతికి చెందిన కోడి పెట్టిన గుడ్డు పొదిగి గురువారం నాలుగు కాళ్ల కోడి పిల్ల బయటకు వచ్చింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. నాలుగు కాళ్ల కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉందని పున్నయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment