Inkollu
-
ఎమ్ఆర్ఆర్ హైస్కూల్ డైరెక్టర్ వీరయ్య కీచక పర్వం
-
దేహం రెండు ముక్కలైన వైనం
ఇంకొల్లు : కలలో కూడా ఊహించలేనంతగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతదేహం రెండు ముక్కలుగా ఛిద్రం అయింది. ఇంకొల్లులోని పావులూరు రోడ్డు టీటీడీ కల్యాణ మండపం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్రోణాదుల నుంచి మిర్చి లోడుతో ఇంకొల్లుకు టాక్టర్ వస్తోంది. ఇదే సమయంలో పావులూరు గ్రామానికి చెందిన ముగ్గురు బైకుపై ఇంకొల్లు నుంచి పావులూరుకు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు ఎగిరపడ్డారు. బట్టు శ్రీను (45) మృతదేహం రెండు ముక్కలై అవయవాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. బట్టు శ్రీనుకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. గాలి శ్రీను (40)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చుండూరి మరియదాసు (28)కు చిన్న పాప ఉంది. సంఘటన తెలుసుకున్న ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు, ఎస్సై వి.రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది ట్రాఫిక్ను నియంత్రించారు. సంఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేషగిరిరావు తెలిపారు. -
చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఎక్కడుంది?
సాక్షి, ప్రకాశం : చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన.. ఇంకొల్లు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అభివృద్ధి ఎక్కడుంది? ‘నిన్నటి కంటే నేడు బాగుంటే అది అభివృద్ధి. కానీ, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అది మచ్చుకు కూడా కనిపించటం లేదు. మహిళలు, చిన్న పిల్లలను కూడా వదలకుండా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా ఆయన నెరవేర్చలేదు. పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మద్యం షాపులను ప్రొత్సహిస్తున్నాడు. అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లులు తగ్గిస్తానన్నాడు. అవేమో ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి. రేషన్ సరుకుల్లో కోత పడింది. రైతుల కోసం ప్రవేశపెట్టిన రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ మహిళా కన్నీరు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. చివరకు నిరుద్యోగుల భృతి విషయంలో మాట తప్పాడు. ఇలా అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు’ అని వైఎస్ జగన్ నిలదీశారు. వాళ్లను బంగాళాఖాతంలో కలిపేయండి చెడిపోయిన రాజకీయాల్లోకి విశ్వసనీయత వస్తేనే బాగుపడుతుందని, నేతలు ఎవరైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతితో అడ్డగోలు డబ్బు సంపాదించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. వారిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు తేవాలన్న తన ప్రయత్నానికి ప్రజల నుంచి మద్ధతు కావాలని జగన్ కోరారు. ‘ఇప్పుడు చంద్రబాబును క్షమిస్తే రేపు పెద్ద మోసాలకు తెరలేపుతాడు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలిపేయండి. మనస్సాక్షిగా ఓటేయండి’ అంటూ ప్రజలను జగన్ కోరారు. నవరత్నాల్లో రైతన్నల కోసం... ఇక సభలో నవరత్నాల ద్వారా రైతులకు ఏం చేయబోతున్నారన్నది జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో రైతులు దీనావస్థలో ఉన్నారన్న జగన్.. ప్రజాప్రభుత్వంలో వారిని ఆదుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వారికున్న సమస్యలను వివరించిన ఆయన.. రైతులకు పెట్టుబడి తగ్గించగలిగితే ఆదాయాలు బాగా పెరుగుతాయన్న అభిప్రాయ పడ్డారు. రైతుల కోసం ప్రకటించిన హామీలు - పగటి పూట 9గంటల ఉచిత కరెంట్ - క్రాప్ లోన్లపై వడ్డీలు భారం లేకుండా చూడటం - రైతులకు ఉచితంగా బోర్లు వేయించటం - మే నెలలో రైతులకు సాయం కింద రూ. 12,500 అందజేత - పంట వేయకముందే మద్ధతు ధర ప్రకటించి.. కొనుగోలు చేయటం - గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లు కేటాయింపు - విపత్తు నిధి కింద రూ. 4 వేల కోట్ల కేటాయింపు. తద్వారా కరువు, వరదల నుంచి రైతులను ఆదుకోవటం - యుద్ధ ప్రతిపాదికన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి - కో-ఆపరేటివ్ డైరీల పునరుద్ధరణ. పాడి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవటం -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఇంకొల్లు: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉంటాయి. అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు స్టాలిన్పేటకు చెందిన దుడ్డు పున్నయ్య ఇంట్లో నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. విడికాళ్ల జాతికి చెందిన కోడి పెట్టిన గుడ్డు పొదిగి గురువారం నాలుగు కాళ్ల కోడి పిల్ల బయటకు వచ్చింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. నాలుగు కాళ్ల కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉందని పున్నయ్య తెలిపారు. -
బాలల హక్కులు హరిస్తే కేసులే!
ఇంకొల్లు : బాలల హక్కులను హరించే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారిణి జ్యోతిసుప్రియ హెచ్చరించారు. ‘బతుకులు మెతుకులు వెతుకుతున్నయట!’ శీర్షికన ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. సోమవారం ఇంకొల్లు వద్ద పాత మద్రాసు రోడ్డులో మట్టి పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. అక్కడున్న పిల్లలను సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కార్యకర్తలను ఆదేశించారు. పనులు చేసే ప్రాంతాల్లో బాలలకు రక్షణకు చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. లేదంటే బాలల హక్కులను హరిస్తున్నందుకు వారిపై కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
మైనర్పై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
ఇంకొల్లు, న్యూస్లైన్ : పద్నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇంకొల్లు పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మసముద్రం ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్రా వీరాస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే బాలిక తల్లి మృతి చెందటంతో అమ్మమ్మ,తాతయ్యల వద్దే ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆటో డ్రైవర్ వీరాస్వామి వెళ్లి మంచినీరు అడిగాడు. తెలిసిన వ్యక్తి కావటంతో బాలిక వంటింట్లోకి వెళ్లింది. వెనక నుంచి ఇంట్లోకి వచ్చిన వీరాస్వామి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక పెద్దగా అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం పొలం నుంచి వచ్చిన అమ్మమ్మ,తాతయ్యలకు విషయం చెప్పింది. బాలిక తండ్రి గురువారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కైలాస్నాథ్ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.