poult
-
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఇంకొల్లు: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉంటాయి. అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు స్టాలిన్పేటకు చెందిన దుడ్డు పున్నయ్య ఇంట్లో నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. విడికాళ్ల జాతికి చెందిన కోడి పెట్టిన గుడ్డు పొదిగి గురువారం నాలుగు కాళ్ల కోడి పిల్ల బయటకు వచ్చింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. నాలుగు కాళ్ల కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉందని పున్నయ్య తెలిపారు. -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
జంగారెడ్డిగూడెం రూరల్ : ఓ కోడి పిల్ల నాలుగు కాళ్లతో ఆశ్చర్యపరుస్తోంది. ఆ కోడి పిల్లను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన రాచగొర్ల అచ్యుత రామయ్య పెంచుకుంటున్న కోడి 13 గుడ్లు పెట్టింది. వీటిని పొదిగి పిల్ల లను చేసింది. ఆ పిల్లల్లో ఒకదానికి రెండు కాళ్లు అదనంగా వచ్చాయి. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ కోడి పిల్లకు నాలుగు కాళ్లు వచ్చాయని పశు సంవర్దక శాఖ అధికారులు చెబుతున్నారు.