
హర్మన్‌ప్రీత్ కు ఆసీస్ జెర్సీ...
డెర్బీ: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్లో అజేయ సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు అరుదైన కానుక ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ అలెక్స్ బ్లాక్‌వెల్ తన టీమ్ జెర్సీని హర్మన్‌కు బహుమతిగా ఇచ్చింది.
బిగ్‌బాష్ లీగ్‌లో కౌర్, బ్లాక్‌వెల్‌తో కలిసి సిడ్నీ థండర్స్ జట్టు తరఫున ఆడింది. సెమీస్ మ్యాచ్ జ్ఞాపికగా తనకు బ్లాక్‌వెల్ జెర్సీ ఇవ్వడంపై కౌర్ కృతజ్ఞతలు తెలిపింది.