
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే వైదొలిగాడు. తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తానీ నిర్ణయం తీసుకున్నానని ముర్రే తెలిపాడు.
30 ఏళ్ల ఈ బ్రిటన్ స్టార్ ఐదుసార్లు (2010, 2011, 2013, 2015, 2016) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా ఐదుసార్లూ రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నాడు. మణికట్టు గాయం కారణంగా జపాన్ స్టార్ నిషికోరి కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగాడు.