వుడ్‌మెన్ కోట్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న సెకండ్ ఎలెవన్ చాంపియన్‌షిప్ సౌత్ గ్రూప్‌లో ససెక్స్ షైర్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఆరు వికెట్లతో సత్తాచాటగా, ఆపై బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిశాడు. మంగళవారం గ్లౌసెష్టర్‌షైర్‌తో ప్రారంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లను నేలకూల్చాడు. అతని ధాటికి గ్లౌసెష్టర్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. దాంతో తన తొలి ఇన్నింగ్స్‌లో గ్లౌసెష్టర్ షైర్ 79 పరుగులకే చాపచుట్టేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో వచ్చిన ఆర్చర్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు సాధించాడు. గ్లౌసెష్టర్ బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ససెక్స్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది. తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్లౌసెష్టర్ 199 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లలో ఆర్చర్ వికెట్ సాధించాడు.
దాంతో యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆర్చర్ ఆడటం దాదాపు ఖాయమనట్లే కనబడుతోంది. యాషెస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్‌ను తీసుకున్నా తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు ఉండటంతో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. అండర్సన్ రెండో టెస్టుకు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఆర్చర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో 20 వికెట్లు సాధించి ఇంగ్లండ్ టైటిల్ సాధించడంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment