మా నిధుల్లో కోత ఎందుకు? | Associate, Affiliate nations concerned about fund reduction | Sakshi
Sakshi News home page

మా నిధుల్లో కోత ఎందుకు?

Published Fri, Dec 18 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

Associate, Affiliate nations concerned about fund reduction

 ఐసీసీ అసోసియేట్, అఫిలియేట్ దేశాల ఆగ్రహం
 న్యూడిల్లీ:
ఐసీసీ నుంచి తమకు కేటాయించిన నిధుల్లో కోత విధించడంపై అసోసియేట్, అఫిలియేట్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ త్రీ (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) హయాంలోనే ఇలా జరుగుతోందని ఆరోపించాయి. ఐసీసీ వివిధ దేశాలకు పంచుతున్న నిధులను విశ్లేషించి చూస్తే... మిగతా దేశాలతో పోలిస్తే అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌లకు అదనంగా డబ్బులు అందుతున్నట్లు సమాచారం.
 
  అయితే ఈ డబ్బును అసోసియేట్, అఫిలియేట్ దేశాల నిధుల నుంచి కోత విధించి వాళ్లకు ఇస్తున్నట్లు తేలింది.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌లకు చెరో రూ. 1.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 11 కోట్ల 27 లక్షలు) ఐసీసీ ఇస్తుంది. అయితే ఈ రెండు దేశాలు ప్రస్తుతం 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 20 కోట్లు) వరకు అందుకుంటుండంతో అసోసియేట్, అఫిలియేట్ దేశాలు దీనిపై కన్నెర చేస్తున్నాయి. రెండు దేశాలకు పెంచిన నిధులను ఐసీసీ నిధిలో నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.  
 

Advertisement
Advertisement