
యూఎస్ ఓపెన్‌కు అజరెంకా దూరం
ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ విజేత విక్టోరియా అజరెంకా సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్‌కు దూరం కానుంది. గతేడాది డిసెంబర్‌లో అజరెంకాకు బాబు జన్మించగా.. తాజాగా ఈ శిశువు సంరక్షణ విషయంలో తనకు ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ మధ్య వివాదం నడుస్తోంది.
దీంతో కొన్ని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకునే నేపథ్యంలో యూఎస్ ఓపెన్‌లో ఆడటం లేదని 28 ఏళ్ల ఈ బెలారస్ టెన్నిస్ స్టార్ ట్విట్టర్‌లో పేర్కొంది.