సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన తెలుగుతేజం | B Sai Praneeth captures maiden Superseries title in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన తెలుగుతేజం

Published Sun, Apr 16 2017 2:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన తెలుగుతేజం

సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన తెలుగుతేజం

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో తెలుగుతేజం సాయి ప్రణీత్‌ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రణీత్‌ విజయం సాధించి తన కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

హోరాహోరీగా సాగిన ఫైనల్‌ సమరంలో ప్రణీత్‌ 17-21, 21-17, 21-12 స్కోరుతో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. ప్రణీత్‌ తొలి గేమ్‌ కోల్పోయినా, వెంటనే పుంజుకుని రెండో గేమ్‌ను సొంతం చేసుకుని విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక చివరి, మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు. పలువురు క్రీడాకారులు, అధికారులు.. ప్రణీత్‌ను అభినందించారు.

ప్రణీత్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు: సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించిన ప్రణీత్‌కు వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రణీత్‌ తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement