గతంలో భారత్ చాలా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించాలంటే మాత్రం చుక్కలు కనిపించేలా ఉన్నాయి. 2017లో భారత్ అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ నిర్వహించనుంది. దీనికోసం ఫిఫా అధికారులు టోర్నీ కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఒక జాబితా పంపించారు. ఇందులో ఏకంగా 8532 అంశాలు ఉన్నాయి. గదుల్లో ఉండాల్సిన ఫ్రిజ్‌లు, హెయిర్ డ్రయర్స్ దగ్గరి నుంచి బాత్‌రూమ్‌లు ఎలా ఉండాలో కూడా ఆ జాబితాలో ఉంది.
ఎక్కడా బండలు జారకూడదట. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాల్సిన ఐస్ బరువుతో పాటు బాత్‌రూమ్ షవర్‌లో నీళ్లు ఎలా రావాలో కూడా ఆ జాబితాలో ఫిఫా పేర్కొంది. ఇక వేదికల్లో చేయాల్సిన ఏర్పాట్లు, మైదానంలో ఉండాల్సిన గడ్డి లెవల్... ఇలా ఆ జాబితా అంతా చదవడానికే రెండు రోజులు పడుతుందని టోర్నమెంట్ డెరైక్టర్ జేవియర్ సెప్పి తెలిపారు. ఫుట్‌బాలా మజాకా..!
బాత్‌రూమ్‌లు బాగుండాలి...
Published Sun, May 31 2015 1:45 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM
Advertisement
Advertisement