సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీసీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్‌లో భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) జట్టు సత్తా చాటింది. పవర్‌స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో బీబీఎంబీ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బీబీఎంబీ 58– 18తో ఎస్‌జేవీఎన్ జట్టుపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పవర్‌గ్రిడ్ జట్టు 48–12తో నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)పై గెలిచింది.
బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్‌ఆర్‌టీఎస్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్, పవర్‌గ్రిడ్ జీఎం ఎ. రవీందర్, తెలంగా ణ కబడ్డీ సంఘం కార్య దర్శి జగదీశ్వర్ యాదవ్ విజేతలకు పతకాలను అందజేశారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సురీందర్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ ప్లేయర్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులను అందుకున్నాడు. బల్వంత్ రాణా (ఎస్‌జేవీఎన్) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్’, ప్రతాప్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ క్యాచర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలను గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment