
పట్నా పైరేట్స్‌కు షాక్
మ్యాచ్ ముగిసేందుకు ఇక 90 క్షణాలే మిగిలున్నాయి.
చివరి నిమిషంలో బెంగాల్ అనూహ్య విజయం ∙ప్రొ కబడ్డీ లీగ్
కోల్‌కతా: మ్యాచ్ ముగిసేందుకు ఇక 90 క్షణాలే మిగిలున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–35 స్కోరుతో గెలుపు ఖాయం చేసుకుంది. కానీ అనూహ్యంగా విజయానికి చేరువైన పైరేట్స్ సెకన్ల వ్యవధిలో దూరమైంది. బెంగాల్ వారియర్స్ 41–38 స్కోరుతో పైరేట్స్‌కు షాకిచ్చింది. రైడర్ మణిందర్ సింగ్ చివర్లో మెరుపు వేగంతో తెచ్చిపెట్టిన పాయింట్లు వారియర్స్‌ను గెలిపించాయి. మ్యాచ్ మొత్తం మీద 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన మణిందర్ 13 పాయింట్లు సాధించాడు.
జాంగ్ కున్ లీ (6), వినోద్ కుమార్ (5), రాన్ సింగ్ (4) రాణించారు. పట్నా జట్టులో పర్‌దీప్ నర్వాల్ (11) రైడింగ్‌లో అదరగొట్టాడు. మోను గోయత్ 5, జైదీప్ 3, విశాల్ మనే 2 పాయింట్లు చేశారు. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.