కాంస్యంతో బోణీ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్ కాంస్య పతకంతో బోణీ చేసింది. పురుషుల గ్రీకో రోమన్ 80 కేజీల విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జున్‌జీ నా (చైనా)తో జరిగిన బౌట్‌లో హర్‌ప్రీత్ 3–2 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్ కాంస్య పతకం నెగ్గడం వరుసగా ఇది రెండో ఏడాది.
గత సంవత్సరం బ్యాంకాక్‌లో జరిగిన ఈవెంట్‌లోనూ హర్‌ప్రీత్ కాంస్య పతకాన్ని సాధించాడు. మరోవైపు 75 కేజీల కాంస్య పతక పోరులో గుర్‌ప్రీత్ సింగ్ (భారత్) 0–8తో బిన్ యాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన రవీందర్ (66 కేజీలు), హర్‌దీప్ (98 కేజీలు), నవీన్ (130 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్స్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచారు.