నైనా ‘హ్యాట్రిక్’ | central zone national ranking Table tennis championship naina jaiswal | Sakshi
Sakshi News home page

నైనా ‘హ్యాట్రిక్’

Published Wed, Oct 2 2013 1:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

నైనా ‘హ్యాట్రిక్’

నైనా ‘హ్యాట్రిక్’

 సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ విజేతగా నిలిచింది. గుజరాత్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో నైనా సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ దక్కించుకుంది.
 
 
  ఫైనల్లో ఆమె 11-4, 11-6, 11-7, 11-5తో ఐశ్వర్య పాఠక్ (ఉత్తరప్రదేశ్)పై గెలిచింది. 2011, 2012లలో కూడా జాతీయ సబ్ జూనియర్ టైటిల్స్ నెగ్గిన నైనా తాజా విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement