
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఢిల్లీ డాషర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 0–3తో ఓడింది. ఢిల్లీ ‘ట్రంప్’ మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి–యాంగ్ లీ (చెన్నై) జంట 15–13, 15–11తో ఇవనోవ్–సొజోనోవ్ జోడీపై నెగ్గింది. దాంతో చెన్నై ఖాతాలో పాయింట్ చేరగా... ఢిల్లీ స్కోరు –1గా నిలిచింది. అయితే తొలి పురుషుల సింగిల్స్‌లో విన్సెంట్ (ఢిల్లీ) 15–10, 15–13తో లెవెర్‌డెజ్ (చెన్నై)ను ఓడించడంతో ఢిల్లీ స్కోరు 0–1గా మారింది.
రెండో పురుషుల సింగిల్స్‌లో తియాన్ హువీ 15–14, 15–10తో సెన్‌సోమ్‌బున్‌సుక్ (చెన్నై)పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ (ఢిల్లీ) 11–15, 15–13, 15–14తో పీవీ సింధు (చెన్నై)పై నెగ్గడంతో ఢిల్లీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చెన్నై ఎంచుకున్న మిక్స్‌డ్ డబుల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో గాయంతో క్రిస్ అడ్‌కాక్–గాబ్రియేలా (చెన్నై) జంట వైదొలిగింది. దాంతో అశ్విని పొన్నప్ప–ఇవనోవ్ (ఢిల్లీ) జంటను విజేతగా ప్రకటించారు. ‘ట్రంప్’ మ్యాచ్‌లో ఓడటంతో చెన్నై పాయింట్ చేజార్చుకోగా... ఢిల్లీ ఖాతాలో పాయింట్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment