ఈ నెల 14 నుంచి చెస్‌ టోర్నీ | Chess Tourney Starts from 14th July | Sakshi
Sakshi News home page

ఈ నెల 14 నుంచి చెస్‌ టోర్నీ

Published Thu, Jul 5 2018 10:17 AM | Last Updated on Thu, Jul 5 2018 10:17 AM

Chess Tourney Starts from 14th July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్క లక్ష్మి స్మారక ఆలిండియా ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. పల్లవి చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 4.2 లక్షలు. ఎంట్రీ ఫీజు రూ. 2 వేలు. ఫిడే రేటింగ్‌ 1500 కంటే తక్కువ ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గల వారు ఈ నెల 10లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

స్పాట్‌ ఎంట్రీలకు ప్రవేశం లేదు. క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రాలు తప్పక తీసుకురావాలి. మరిన్ని వివరాలకు  8919377311 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement