నైట్‌రైడర్స్‌కు ఆడనున్న క్రిస్‌గేల్‌ | Chris Gayle will play for Cape Town Knight Riders | Sakshi
Sakshi News home page

నైట్‌రైడర్స్‌కు ఆడనున్న క్రిస్‌గేల్‌

Published Mon, Aug 28 2017 11:05 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

నైట్‌రైడర్స్‌కు ఆడనున్న క్రిస్‌గేల్‌

నైట్‌రైడర్స్‌కు ఆడనున్న క్రిస్‌గేల్‌

కేప్‌టౌన్‌ : విధ్వంసకర ఆటగాడు, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్‌ నైట్‌రైడర్స్‌ తరఫున ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఐపీఎల్ లో ప్రస్తుతం గేల్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేయర్ కదా.. మరి నైట్‌రైడర్స్‌కు ఎందుకు ఆడుతున్నాడు.. జట్టు మారనున్నాడా అని డౌట్ పడుతున్నారు కదూ.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.

వాస్తవానికి విండీస్ క్రికెటర్ గేల్‌ ప్రాతినిధ్యం వహించనున్నది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కాదు.. కేప్‌టౌన్‌ నైట్‌రైడర్స్‌ జట్టుకు.  దక్షిణాఫ్రికా క్రికెట్‌ అసోసియేషన్ ఈ ఏడాది ట్వంటీ20 అంతర్జాతీయ టోర్నీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ కేప్‌టౌన్‌ వేదికగా కేప్‌టౌన్‌ నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. స్టార్ క్రికెటర్లు జేపీ డుమిని, క్రిస్‌గేల్‌ ను నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. మరోవైపు ప్రిటోరియా మావరిక్స్ లో ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో ఉన్నారు. నవంబర్ 3న ప్రారంభపు మ్యాచ్‌లో ప్రిటోరియా మావరిక్స్‌తో గేల్ జట్టు కేప్‌టౌన్ నైట్ రైడర్స్ తలపడనుంది. డిసెంబర్ 16న టోర్నీ ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement