
న్యూఢిల్లీ: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంజుమ్ మౌడ్గిల్ రెండో పతకాన్ని సాధించింది. బ్రిస్బేన్‌లో శనివారం జరిగిన మహిళల 50మీ. రైఫిల్ ఫ్రోన్ ఈవెంట్‌లో అంజుమ్ కాంస్య పతకాన్ని సాధించింది. ఫైనల్లో 620.7 పాయింట్లు స్కోర్ చేసిన జెన్నిఫర్ సింటోష్ (స్కాట్లాండ్) పసిడిని కైవసం చేసుకోగా, సియోనాడ్ సింటోష్ (619.9, స్కాట్లాండ్) రజతాన్ని గెలుచుకుంది.
కాంస్యాన్ని సాధించిన అంజుమ్ 616.7 పాయింట్లు స్కోర్ చేసింది. ఇదే టోర్నీ 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లోనూ అంజుమ్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్ రైఫిల్, పిస్టల్ ఈవెంట్‌లలో 14 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత్‌కు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (288 పాయింట్లు), నీరక్ కుమార్ (286 పాయింట్లు), అనీశ్ భన్వాలా (285 పాయింట్లు) తొలి 3 స్థానాలను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment