సైనాకు సీఆర్‌పీఎఫ్‌ డీజీ ప్రశంసలు | CRPF DG appreciates Saina Nehwal for supporting martyrs | Sakshi
Sakshi News home page

సైనాకు సీఆర్‌పీఎఫ్‌ డీజీ ప్రశంసలు

Published Thu, Apr 20 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

CRPF DG appreciates Saina Nehwal for supporting martyrs

హైదరాబాద్‌: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ను సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ సుదీప్‌ లక్టాకియా ప్రశంసించారు. ‘ సైనా మీ ఆలోచనా విధానానికి మేం కృతజ్ఞులం. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం మీరు చేసిన పని చాలా గొప్పది. మీ చర్యతో మేము కదిలిపోయాం.

జవాన్ల కుటుంబాలపై మీరు చూపించిన ప్రేమ... దేశభక్తులందరికీ స్ఫూర్తినిస్తుంది’ అని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మార్చి 11న జరిగిన నక్సల్స్‌ దాడిలో విధుల్లో ఉన్న పలువురు పోలీసులు ప్రాణాలొదిలారు. దీంతో అమర జవాన్ల కుటుంబాల కోసం సైనా తన పుట్టినరోజు (మార్చి 17) సందర్భంగా రూ. 6 లక్షలు విరాళంగా ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement