
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో మరోసారి తడబడింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 35 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో చెన్నైకు ఇది నాల్గో అత‍్యల్ప స్కోరు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మూడోసారి కావడం గమనార్హం.
అంతకుముందు సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే పవర్ ప్లేలో 27 పరుగులు సాధించగా, క్వాలిఫయర్-1లో సీఎస్‌కే 33 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో చెన్నై 35 పరుగులకే పరిమితమై మరోసారి పేలవ ప‍్రదర్శన చేసింది. తుది పోరులో సన్‌రైజర్స్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సీఎస్‌కే 16 పరుగులకే తొలి వికెట్‌ను నష్టపోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో డుప్లెసిస్(10) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సురేశ్ రైనా- వాట్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్‌కే తన పవర్ ప్లేలో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment