బండారు అయ్యప్ప
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్ జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2018లో అయ్యప్పను దక్కించుకున్న ఢిల్లీ కాపిటల్స్ ఈసారి కూడా రూ.20 లక్షలకు అతన్ని జట్టులోకి తీసుకుంది. మీడియం పేసర్ అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అవ్వడం విశేషం. కాగా, ఐపీఎల్ 2019లో 351 ఆటగాళ్లు వేలానికి రాగా... 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ సీజన్ 12 కోసం జరగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనం నమోదు చేశాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఏకంగా రూ.8.40 కోట్ల రికార్డు ధరకు కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఇదిలాఉండగా.. తొలి రౌండ్‌లో యువరాజ్‌ను పక్కకు పెట్టిన ఫ్రాంచైజీలు.. రెండో రౌండ్ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment