జైపూర్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ధోని నేతృత్వంలోని సీఎస్‌కే అంచనాలకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ధోని ‘సెంచరీ’ రికార్డుకు చేరువగా వచ్చాడు. ఈరోజు(గురువారం) జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో చెన్నై తలపడనుంది. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. ఐపీఎల్‌లో ధోని కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకుంటాడు.
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 165 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోని.. 99 విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇంకో విజయం సాధిస్తే కెప్టెన్ సెంచరీ మార్కును అందుకుంటాడు. అదే సమయంలో ఓవరాల్ ఐపీఎల్‌లో వంద మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా ధోని నిలుస్తాడు. ప్రస్తుతం ధోనికి పోటీగా ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో ధోని అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో గౌతం గంభీర్ ఉన్నాడు. గంభీర్ 129 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా, 71 మ్యాచ్‌లో గెలుపు రుచిని చూశాడు.
(ఇక్కడ చదవండి: ఏం పిచ్‌లు.. ఎవడు ఆడుతాడు: ధోని ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment