రాంచీ (జార్ఖండ్) : మూడు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారం రాత్రి ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనికి డిన్నర్ ఇచ్చారు. జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించేందుకు రాష్ట్రపతి రాంచీ నగరానికి వచ్చారు. రాష్ట్రపతి ఆదివారం గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, భారీవర్షాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. దీంతో రాంచీలోని రాజ్‌భవన్ లో బస చేసిన రాష్ట్రపతి ఆదివారం రాత్రి విందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆహ్వానించారు.
అంతర్జాతీయ క్రికెట్ కు విరామం ఇచ్చిన ధోని ఇటీవల జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన బిలియర్డ్స్ క్రీడల్లో పాల్గొన్నాడు. అంతకుముందు న్యూయార్క్‌లో గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా గడుపుతున్నాడు ధోని. కొన్ని రోజుల క్రితం ధోని గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాను మర్చిపోకుండా ధోని ముందు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment