
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీలను అవుట్ చేయడమే తన లక్ష్యమని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్సష్టం చేశాడు. ఈ నెల 7 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతున్నాడు. జనవరిలో జరిగిన వేలంలో కుల్దీప్‌ను రూ. 5.8 కోట్లకి కోల్‌కతా దక్కించుకుంది. దీనిలో భాగంగా కోల్‌కతా జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. తనకు ఎటువంటి లక్ష్యాలు లేవని చెబితే అది నమ్మశక్యంగా ఉండదన్న కుల్దీప్.. ధోని, కోహ్లి వికెట్‌పైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపాడు.
'ఐపీఎల్ 2018లో నాకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవని చెబితే అది అబద్దమే అవుతుంది. స్పిన్‌ని సమర్థంగా ఎదుర్కొనే విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ వికెట్లను ఈ టోర్నీలో తీయడమే నా టార్గెట్. ఐపీఎల్‌లో మాత్రమే నాకు ఈ అవకాశం దొరుకుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ వారి వికెట్ తీసే ఛాన్స్ నాకు రాదు కదా.? (నవ్వుతూ). అందుకే.. ఐపీఎల్‌లో వారి వికెట్ పడగొట్టాలని ఆశపడుతున్నా’ అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment