కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ (పాత చిత్రం)
న్యూఢిల్లీ : జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే టీమిండియా మణికట్టు స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లు రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టుకున్న ఈ బౌలర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్నారు. చహల్, కుల్దీప్‌లు జట్టులో తమ స్థానం, మ్యాచ్‌ల అనుభవంపై పలు విషయాలు షేర్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల మద్దతుతోనే రాణిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వికెట్ల వెనుక ఉండి కీపింగ్ చేసే ధోని.. 50 శాతం బౌలర్ల పని పూర్తి చేస్తాడని ‘మిస్టర్ కూల్’ కొనియాడారు. కెప్టెన్ మాకు బంతిని అప్పగించాక ధోనీ మా దగ్గరకొచ్చి వికెట్లు ఎలా తీయాలో చెప్తాడు. బ్యాట్స్‌మెన్ బలహీనతను వివరించి మా పని సులువు చేస్తాడు. ఒకవేళ ఓవర్‌లో 10 నుంచి 15 పరుగులు ఇచ్చినా.. మాపై ధోనీ, కోహ్లీలు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్‌ల్లో ఇద్దరం కలిసి ఆడాం. జట్టు విజయాల్లో భాగస్వాములయ్యాం. అయితే ఇంగ్లండ్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారని చహల్ అన్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్ అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన మా ఇద్దరికీ కీలకమని భావిస్తున్నా. ఈసారి ఇంగ్లండ్‌లో పర్యటించబోయేది బెస్ట్ ఇండియన్ టీమ్ అని చహల్ తెలిపాడు.
‘యువ ఆటగాళ్లు ప్రతి సిరీస్‌లో రాణించాలని, గతంలో కంటే మెరుగవ్వాలని భావిస్తారు. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉంది. ఆ జట్టు వన్డేలతో పాటు టీ20ల్లోనూ చాలా బాగా ఆడుతోంది. సొంతగడ్డకు ఏదైనా చేయాలని భావిస్తే యువ ఆటగాళ్లకు ఇలాంటి సిరీస్ చాలా మంచి అవకాశమని’ చైనామన్ బౌలర్ కుల్దీప్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment