‘ధోని సలహాలిస్తాడు.. నేను పాటిస్తాను‌’ | Chahal Credits Seniors For His Kuldeep Good Recent Form | Sakshi
Sakshi News home page

‘నా ప్రదర్శనకు ధోనినే కారణం’

Published Fri, May 17 2019 5:17 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

Chahal Credits Seniors For His Kuldeep Good Recent Form - Sakshi

ముంబై: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పై యువ క్రికెటర్‌  యజ్వేంద్ర చహల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీలా మ్యాచ్‌ని అర్థం చేసుకుని ఆడేవాళ్లు ఎవరూ లేరని చాహల్‌ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్‌, తాను రాణించడంలో విరాట్‌ కోహ్లి, ధోని పాత్ర మరువలేనిదని తెలిపాడు. ‘వికెట్ల వెనుక ధోనీ లాంటి వ్యక్తి ఉంటడం జట్టుకు ప్లస్‌ పాయింట్‌. ధోనీ కారణంగానే వచ్చే ప్రపంచ కప్‌లో భారత జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా నేను తొమ్మిదో లేక పదో ఓవర్‌లో బౌలింగ్‌కు వస్తాను. అప్పటికే పిచ్‌ పరిస్థితులను అంచనా వేసిన ధోనీ నాకు సలహాలు ఇస్తాడు. వాటితో మంచి ఫలితాలు రాబట్టవచ్చు’అని చహల్‌ వివరించాడు.
ప్రస్తుతం టీమిండియా జట్టు చాలా  బలంగా ఉందన్న చహల్‌..  కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్‌ ఆటగాడు ధోనిలు  జట్టులో వున్నంత కాలం తమదెప్పుడూ నెంబర్ వన్ జట్టేనని పేర్కొన్నాడు.  అంతేకాకుండా ధావన్, రోహిత్ ల రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉందన్నాడు. ధోని, రాహుల్‌, పాండ్యాలతో మిడిలార్డర్‌ బలంగా దుర్బేద్యంగా ఉందని కితాబిచ్చాడు. ఇక టీమిండియా బౌలింగ్ కూడా బలంగా ఉందని, షమీ, బుమ్రా, భువనేశ్వర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని గర్తుచేశాడు.

టీమిండియాతో పాటు ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు కూడా ఈసారి హాట్ ఫేవరెట్ గా  బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగడం వారికి  కలిసొచ్చే అంశమన్నాడు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా  బలంగా కనిపిస్తున్నాయని...మొత్తానికి  ఈసారి ఫోటీ గట్టిగానే  వుండే  అవకాశముందన్నాడు. ఎంత  బలమైన జట్టునయినా ఎదురించి  గెలిచే సత్తా టీమిండియాకుకు వుందని...ఈ ప్రపంచ కప్ కోహ్లి సేనదేనని చహల్ జోస్యం చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement