ఎప్పుడూ నువ్వే నా కెప్టెన్‌ : కోహ్లి | MS Dhoni 38th Birthday Wishes Pour in Social Media | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ నువ్వే నా కెప్టెన్‌ : కోహ్లి

Published Mon, Jul 8 2019 8:24 AM | Last Updated on Mon, Jul 8 2019 8:24 AM

MS Dhoni 38th Birthday Wishes Pour in Social Media - Sakshi

లీడ్స్‌: భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదివారం 38వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచకప్‌ వేటలో ఉన్న విరాట్‌ సేనతో పాటు, మాజీలు, దిగ్గజ క్రికెటర్లు మహికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భార్య సాక్షి, కుమార్తె జీవాలతో కలిసి శనివారం రాత్రే కేక్‌ కటింగ్‌తో ధోని వేడుక చేసుకున్నాడు. అనంతరం కేక్‌ క్రీమ్‌ పూసుకున్న ముఖంతో ధోని తన గారాలపట్టి జీవాతో కలిసి చిందులు వేశాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడంతో లక్షల్లో లైక్‌లు వచ్చిపడ్డాయి. ‘హ్యాపీ బర్త్‌డే మహి’ అనే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఎప్పట్లాగే కెప్టెన్‌ కోహ్లి తన నాయకుడు ధోనినే అంటూ అతనికి విషెస్‌ చెప్పగా... వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ తాము మాంచెస్టర్‌ వెళ్లే దారిలో బస్‌ జర్నీలో ధోని జన్మదిన వేడుక చేసుకుంటామన్నాడు. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ట్విట్టర్‌లో ‘విష్‌ యు హ్యాపీబర్త్‌ డే ఎం.ఎస్‌.ధోని. ఈ యేడూ నీకు మంచి జరగాలి. మిగతా రెండు మ్యాచ్‌లకు ఆల్‌ ద బెస్ట్‌’ అని ట్వీట్‌ చేశాడు. సెహ్వాగ్‌ వినూత్నంగా ‘7 ఖండాలు, 7 రోజులు, హరివిల్లులోని 7 రంగులు, 7 సంగీత స్వరాలు, పెళ్లిలో 7 అడుగులు, 7 వింతలు, ఏడో నెలలో ఏడో తేదీన పుట్టిన క్రికెట్‌ అద్భుతం ధోనికి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడు. అలాగే జట్టు సహచరులందరూ ధోనికి విషెస్‌ చెప్పారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement