
బర్మింగ్‌హామ్ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిని మరోసారి టార్గెట్ చేస్తూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అతడి స్లో బ్యాటింగ్‌తోనే భారత్ 350కి పైగా స్కోర్ సాధించలేకపోయిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శతకంతో పాటు కేఎల్ రాహుల్ అర్దసెంచరీ సాధించడంతో ఓ దశలో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తుందని అందరూ భావించారు. అయితే వెంటవెంటనే వికెట్లు పడటంతో పాటు బ్యాట్స్‌మెన్ స్లో బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ ముందు టీమిండియా అనుకున్నంత లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. ముఖ్యంగా బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న ధోని(33 బంతుల్లో 35 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సింగిల్స్‌తో సరిపెట్టిన ధోని.. పలుమార్లు స్ట్రైక్ రోటేట్ చేయడంలో కూడా విఫలమయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ధోని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
‘వయసైపోయిందని సీనియర్ క్రికెటర్లను తప్పించడంలో కెప్టెన్‌గా ధోని సఫలమయ్యాడు.. కానీ వయసైపోయిన ధోనిని తప్పించడంలో కెప్టెన్‌గా కోహ్లి ఫెయిల్యూర్ అయ్యాడు’, ‘సహచర బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచడంలో ధోని ప్రత్యర్థి బౌలర్లను మించిపోతాడు’,, ‘నీకు కొట్టడం కుదరకపోతే కనీసం భువనేశ్వర్‌కు స్ట్రైకింగ్ ఇవ్వచ్చు కదా’, ‘ధోని అన్‌టోల్డ్ స్టోరీలో సిక్సర్లను చూపించారు.. దాని సీక్వల్‌గా తీసే చిత్రంలో కేవలం సింగిల్స్‌ను మాత్రమే చూపించాలి’,‘ఇంగ్లండ్‌పై రాణించకుంటే పర్లేదనుకున్నాం.. ఆఖరికి బంగ్లాపై కూడా ఇలాగే ఆడితే ఏమనుకోవాలి’అంటూ నెటిజన్లు ధోనిని విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారు.