అన్ని క్రీడలపై సమాన దృష్టి లేదు | Don’t understand our country’s obsession with Olympics: Pankaj Advani slams ‘TOPS’ | Sakshi
Sakshi News home page

అన్ని క్రీడలపై సమాన దృష్టి లేదు

Published Tue, May 12 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

అన్ని క్రీడలపై సమాన దృష్టి లేదు

అన్ని క్రీడలపై సమాన దృష్టి లేదు

క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత్‌లో అన్ని క్రీడలను సమానంగా చూడడం లేదనే విషయం కేంద్ర ప్రభుత్వ ‘టాప్’ పథకాన్ని గమనిస్తే అర్థమవుతోందని పన్నెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ అన్నాడు. అన్ని క్రీడా పోటీలను ఒకే దృష్టితో చూసినప్పుడే ప్రపంచ క్రీడా రంగంలో భారత్ అభివృద్ధి చెందుతుందని సూచించాడు. ‘ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లపై మన దేశానికున్న అభిప్రాయం అర్థం చేసుకోవడం కష్టం గా భావిస్తాను. అవి నాలుగేళ్లకోసారి వచ్చే ప్రతిష్టాత్మక ఈవెంట్స్ అనే విషయం తెలుసు.

ఆ కారణంగా ఇతర ఈవెంట్స్‌కన్నా ఇవే గొప్ప అనుకోవడం సమంజసం కాదు. ఒకవేళ ఎవరైనా క్రీడలను, ఆటగాళ్లను ప్రోత్సహించాలనుకుంటే ఈవెంట్ ఆధారంగా చేయకూడదు. మనకిప్పుడు ప్రతీ క్రీడలో ప్రపంచ అగ్రశ్రే ణి ఆటగాళ్లున్నారు. క్రీడా ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. అందుకే ప్రతీ ఆటకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని అద్వానీ అన్నాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement