ధోనితో ఆడటం నా అదృష్టం: యువ స్పిన్నర్‌ | Feel Proud to be Playing With MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోనితో ఆడటం నా అదృష్టం: యువ స్పిన్నర్‌

Published Wed, Aug 30 2017 11:21 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

ధోనితో ఆడటం నా అదృష్టం: యువ స్పిన్నర్‌

ధోనితో ఆడటం నా అదృష్టం: యువ స్పిన్నర్‌

సాక్షి, కొలంబో: భారత్‌ మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై యువ స్పిన్నర్‌ కులదీప్‌ యాదవ్‌ ప్రశంశల వర్షం కురిపించాడు. ధోని తన లాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటాడని కులదీప్‌ కొనియాడాడు. ధోనితో గత కొద్దికాలంగా తరచూ మాట్లాడుతన్నానని, తన ఆటతీరు మెరుగు పర్చుకోవడానికి అమూల్యమైన సలహాలు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. మహీ నుంచి చాలా నేర్చుకున్ననని కులదీప్‌ అన్నాడు.

ధోని లాగ తన బౌలింగ్‌ను ఎవరూ జడ్జ్‌ చేయలేరంటూ ఆకాశానికెత్తేశాడు. వికెట్ల వెనుక నిలబడి తనకు కావాల్సిన విధంగా బౌలింగ్‌ చేయించుకుంటాడని పొగిడాడు. ధోని 300 వన్డే మ్యాచ్‌లో తాను ఆడటం తన అదృష్టంగా భావిస్తానని, అది తనకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

అంతేకాదు కోచ్‌ల మార్పిడి గురించి అడిగితే కుంబ్లే, రవిశాస్త్రి ఇద్దరూ తనని ఒకేలా చూశారన్నాడు. వారిద్దిరిలో ఎటువంటి తేడా కనిపించలేదన్నాడు. తన ఆటతీరు మెరుగుపర్చుకోవడం గురించి ఇద్దరు విలువైన సలహాలు ఇచ్చారన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement