
ముంబై : చురుకైన మేదస్సు.. సమయానుకూలంగా అద్భుతమైన నిర్ణయాలతో మ్యాచ్ గతిని మార్చగల నేర్పు కలిగిన ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ.. ప్రస్తుత క్రికెట్‌లో లెజెండ్ అనదగ్గ ఆటగాడు అతను. ఆటను అర్థం చేసుకొని.. వేగంగా వ్యూహాలు రంచించే అతని నైపుణ్యం, మైదానంలో కూల్‌గా ప్రశాంతంగా కనిపించే అతని స్వభావం క్రికెట్ అభిమానులే కాదు.. విశ్లేషకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలాంటి ధోనీ కూడా మానవమాత్రుడేనని, ఆయన కూడా తప్పులు చేస్తారని, ఆయన సూచనలు చాలాసార్లు పనిచేయలేదని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నారు. ముంబైలో సోమవారం జరిగిన సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కుల్దీప్ మీడియాతో మాట్లాడుతూ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ ఇచ్చిన సలహాలు చాలాసార్లు పనిచేయలేదని, అయినా ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేదని కుల్దీప్ సరదాగా వ్యాఖ్యానించాడు. ధోనీ ఎక్కువ మాట్లాడాడని, మ్యాచ్‌లో అవసరమైన సందర్భంలోనే ఆయన ఓవర్ల మధ్యలో తన అభిప్రాయాలను బౌలర్‌తో పంచుకునేవాడని పేర్కొన్నారు. 2007 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ తన సారథ్యంలో భారత్‌కు అందించిన ధోనీ ప్రస్తుతం విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు.