టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించాడు. కుల్దీప్ ఓ బాలీవుడ్ నటిని పెళ్లాడబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే వరల్డ్‌కప్ విజయానంతరం స్వస్థలానికి (కాన్పూర్) చేరుకున్న కుల్దీప్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే కానీ.. బాలీవుడ్ నటిని కాదని కుల్దీప్ క్లారిటీ ఇచ్చాడు.
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కుల్దీప్ మాట్లాడుతే.. త్వరలోనే శుభవార్త వింటారు. నేను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే. కానీ, నా కాబోయే భాగస్వామి నటి కాదు. అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్నది విషయం కాదు. చేసుకోబోయే అమ్మాయి నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా అన్నదే నాకు ముఖ్యమని అన్నాడు.
ఇదిలా ఉంటే, కుల్దీప్ భారత్ టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. కుల్దీప్ మెగా టోర్నీలో 10 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్‌కప్ విజయానంతరం కుల్దీప్ జట్టుతో పాటు ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాడు. అనంతరం నిన్ననే తన స్వస్థలం కాన్పూర్‌కు చేరుకున్నాడు.
కాన్పూర్‌లో కూడా ముంబైలో జరిగిన తరహాలోనే విజయోత్సవ ర్యాలీ జరిగింది. కుల్దీప్‌ను అభిమానులు ఘనంగా సన్మానించి భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వరల్డ్‌కప్ అనంతరం చాలామంది సీనియర్ల లాగే భారత సెలెక్టర్లు కుల్దీప్ కూడా విశ్రాంతి నిచ్చారు. కుల్దీప్ ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. త్వరలో శ్రీలంకతో జరుగబోయే సిరీస్‌కు కుల్దీప్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment