
తొలి స్వర్ణం షూటింగ్ నుంచి...
రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం షూటర్లదే కానుంది. తొలి రోజు శనివారం నాలుగు స్వర్ణాల కోసం పోటీలు జరగనున్నాయి. షూటింగ్‌లో రెండు పసిడి పతకాలు, ఆర్చరీ, రోడ్ సైక్లింగ్‌లో ఒక్కో స్వర్ణం లభించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో తొలి స్వర్ణం ఖాయం కానుంది. షూటింగ్‌లో రెండో స్వర్ణం (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) అర్ధరాత్రి గం. 12.30 నిమిషాలకు... ఆర్చరీలో పురుషుల టీమ్ స్వర్ణం రాత్రి 2 గంటల ప్రాంతంలో, రోడ్ సైక్లింగ్‌లో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఖాయమవుతాయి.