
తొలి పసిడి అమెరికాదే...
• మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో
• వర్జినియా థ్రాషెర్‌కు స్వర్ణం
రియో డి జనీరో : ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే చెక్కు చెదరని ఏకాగ్రతతో ఆద్యంతం నిలకడగా రాణించిన అమెరికా షూటర్ వర్జినియా థ్రాషెర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 19 ఏళ్ల ఈ యువ షూటర్ రియో ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అమెరికాకు అందించింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో వర్జినియా థ్రాషెర్ 208 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. డూ లీ (చైనా-207 పాయింట్లు) రజతం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ యి సిలింగ్ (చైనా-185.4 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.