అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు తిరిగి ట్రంప్, బైడెన్ మధ్యే జరిగితే ఆ పోటీ నిర్జీవంగా ఉంటుంది. ఓటమి ఫలితాన్ని తిరస్కరించిన ట్రంప్ పట్ల చాలామంది రిపబ్లికన్లు కూడా సుముఖంగా లేరు. అదే సమయంలో డెమొక్రాట్లు కూడా మరొక అభ్యర్థిని వెతుక్కోవడం మంచిది. ఎందుకంటే బైడెన్ కానీ, ట్రంప్ కానీ తమ పార్టీలను ఉత్సాహపరిచే స్థితిలో లేరు. కానీ ఒకవేళ బైడెన్ కాకపోతే సామ్యవాద శైలితో అమెరికాను మరింతగా ముంచే ఉదారవాది డెమొక్రాటిక్ పార్టీ నామినీ కావొచ్చు. అప్పుడు నేను రిపబ్లికన్ పార్టీ నామినీకే ఓటేస్తాను. ఆ నామినీ ట్రంప్ అయితే కూడా నా అభిప్రాయం ఇదేనా? ఇది న్యాయమైన ప్రశ్న.
2024లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భావిస్తున్న మేరీలాండ్ మాజీ గవర్నర్ లారీ హోగన్... టాప్ రేడియో హోస్ట్, రాజ కీయ పండితుడు హ్యూజ్ హెవిట్‌తో చేసిన సంభాషణతో వార్తల్లో కెక్కారు. అధ్యక్ష అభ్యర్థి కోసం రిపబ్లికన్ పార్టీ జరిపే ప్రాథమిక ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి గెలిచి నట్లయితే తాను ‘అసమ్మతితో’ మద్దతిస్తానని హోగన్ చెప్పారు.
అంతకుముందు ఆయనే 2020లో అభ్యర్థుల జాబితాలో లేని రోనాల్డ్ రీగన్‌కు అయినా ఓటు వేస్తాను గానీ, ట్రంప్‌కి ఓటు వేసేది లేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గందరగోళ స్థితిలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ట్రంప్‌కు మద్దతివ్వను కానీ రిపబ్లికన్ పార్టీ నామినీకి మద్దతిస్తాననీ, అయితే ఆ అభ్యర్థి ట్రంప్ కారని ఆశిస్తాననీ చెప్పారు.
ఈ ప్రకటనలో స్పష్టత లేదు కానీ, హోగన్ మాటలు... రిపబ్లికన్ ప్రాథమిక పోటీల్లో ట్రంప్ తిరిగి నిలబడినట్లయితే పరిస్థితి ఏమిటని చాలామంది అమెరికన్లలో నెలకొని ఉన్న డోలాయమాన స్థితిని ప్రతిఫలిస్తున్నాయని చెప్పాలి. ట్రంప్‌ను ద్వేషించేవారు అడగొచ్చు. ‘‘అసలు దేనికి ఈ డోలాయమానం? ప్రజాస్వామ్యాన్ని కూలదోయ డానికి ప్రయత్నించినవాడిని ఎవరైనా ఎందుకు పరిగణించాలి?’’ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అనుసరించబోయే తీవ్ర వామపక్ష వాద విధానాల కన్నా ట్రంప్ వాగాడంబరమే ఎక్కువ చిర్రెత్తించేవాళ్లు మాత్రమే ఇలా సింపుల్‌గా అనేయగలరు.
కొన్ని తక్షణ సమస్యలు
ఈ రెండు అంశాలు నన్ను తీవ్రంగా కలత పెడుతున్నాయి. కానీ ఒక రిపబ్లికన్‌గా నేను దీనికోసం 2024 వరకు వేచి ఉండలేను. బైడెన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనట్లయితే, సామ్యవాద శైలి అధోజగత్తులో మనందరినీ మరింతగా ముంచేసే ఉదారవాద రాజ కీయ నాయకుడు డెమోక్రటిక్ పార్టీ నామినీ కావొచ్చు. నేను మాత్రం తప్పకుండా రిపబ్లికన్ పార్టీ నామినీకే ఓటు వేస్తాను. ఆ నామినీ ట్రంప్ అయితే కూడా నా అభిప్రాయం ఇలాగే ఉంటుందా? ఇది న్యాయమైన ప్రశ్న. తన అధ్యక్ష పదవీ కాలం పొడవునా, ట్రంప్ తన దూకుడు ప్రవర్తన ద్వారా నన్ను ఎంతో నిస్పృహకు గురిచేశారు. కానీ ఆయనకు నా మద్దతు చెక్కుచెదరలేదు. ఎందుకంటే నేను రాజకీయ నేతలను వారి ప్రవర్తనను బట్టి చూడను. వారి ఫలితాలను మాత్రమే పట్టించుకుంటాను.
అయితే ‘ట్రంప్ ఎప్పటికీ వద్దు’ అనే ప్రచారంలో నేను ఇంతకు ముందూ లేను, ఇకపై కూడా ఉండబోను. కొంతమంది పైస్థాయి రిపబ్లికన్లు 2016 నుంచి ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ట్రంప్ నేతృత్వంలోని క్షేత్రస్థాయి ఉద్యమం (దీనికి నేను సంతోషించాను) తమ నుంచి పార్టీని లాగేసుకుందని వీరికి కోపం. అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనను ప్రజలు తిరస్కరించడాన్ని ట్రంప్ ఆమోదించక పోవడం, ఆ తర్వాత 2021 జనవరి 6న జరిగిన హింసాత్మక ఘటనల వల్ల ట్రంప్‌తో రిపబ్లికన్ పార్టీ తెగతెంపులు చేసుకోవాలని నేను అభిప్రాయపడాల్సి వచ్చింది.
అయితే లోపభూయిష్టమైన రాజకీయ ఎంపికలు తరచుగా ఉన్నతమైన ఆదర్శాలతో ఘర్షిస్తుంటాయి. ఇతర విసుగు చెందిన ట్రంప్ మద్దతుదారులతో తాజాగా మాట్లాడుతున్నప్పుడు, ‘‘నామినే షన్ ఆయన గెల్చుకుంటే ఏమవుతుంది?’’ అనే ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు సాధారణంగా గాఢ నిశ్శబ్దం ఆవరిస్తుంది. ‘‘బైడెన్‌కు వోటు వేయడం ఒక్కటే దేశభక్తియుత చర్యగా ఉంటుంది’’ అని వీరిలో చాలా మంది నొక్కి చెబుతారు. అయితే అది అంత సులభమైన విషయం కాదు.
అధ్యక్షుడిగా ఆశ్చర్యకరంగా ప్రభుత్వ పెద్ద విజన్‌కు ఛాంపియన్‌గా నిలిచిన బైడెన్‌ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఆ విజన్‌ను ఆయన తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలోనూ పునరుద్ఘాటించారు.
సబ్సిడీలతో, పన్ను మినహాయింపులతో ప్రత్యామ్నాయ ‘శుభ్రమైన’ శక్తివనరులకు ప్రభుత్వం ఆసరా ఇస్తున్నప్పుడు– సరసమైన శిలాజ ఇంధనాల ధరపై బైడెన్ చేస్తున్న యుద్ధం నాకు చికాకు తెప్పిస్తుంటుంది. ఆయుధాలను కలిగి ఉండటంపై అమెరికా రాజ్యాంగపు రెండో సవరణను మరింతగా అతిక్రమించే, అబార్షన్ హక్కులను క్రమబద్ధీకరించాలనే అభ్యర్థికి నేను ఓటు వేయలేను. చట్టబద్ధమైన వలసలను సులభతరం చేయడాన్ని నేను బల పరుస్తాను. అలాగని అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచే బాధ్యత పట్ల బైడెన్ ప్రభుత్వం ప్రమాదకరమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అనుకుంటున్నాను.
‘నిరసన ఓటు’ లేదు
కాబట్టి 2020లో మూడో పార్టీ అభ్యర్థి కోసం తమ ఓటు వేస్తానని చెప్పిన హోగన్ వంటి రిపబ్లికన్లతో నేను జట్టు కట్టలేను. దీనివల్ల వారి మనస్సాక్షికి ఉపశమనం కలిగిందేమో గానీ వాస్తవంలో దానితో ఉపయోగం లేకపోగా బైడె¯Œ ఎన్నిక కావడానికి తోడ్పడింది. పైగా పాత అమెరికా పథకాలు ‘న్యూ డీల్’, ‘గ్రేట్ సొసైటీ’ వంటి వాటి గురించి చరిత్రకారులు పోల్చేటటువంటి భారీ ప్రభుత్వ విస్తరణకు అది దారితీసింది. అందుకే ఈ చర్చ ట్రంపా? బైడెనా? అని తిరిగి అక్కడికే వచ్చి నట్లయితే, ‘నిరసన ఓటు’పై మన స్వాతంత్య్రాన్ని
వృథా చేయకుండా – కఠినమైన, అసౌకర్యమైన నిర్ణయాన్ని అయినా సరే... తీసుకోవడం పౌరులుగా మనందరి విధి.
ట్రంప్, బైడెన్ తిరిగి పోటీపడటం జరిగినట్లయితే– చట్టబద్ధమైన ఎన్నిక ఫలితాన్ని తిరస్కరించిన వ్యక్తి (తిరిగి అదే పని చేయగలడు కూడా), ఫెడరల్ కోర్టు బెంచ్‌లో సాంప్రదాయిక ఆలోచనలున్న న్యాయమూర్తులను నియమిస్తూనే సామాజిక, ఆర్థిక, సరిహద్దు విధానాలను కఠినంగా చేపట్టగల వ్యక్తి... ప్రగతిశీల విధానాలు అవ లంబిస్తూ, సమస్య తర్వాత సమస్యతో దేశానికి తీవ్ర నష్టం చేస్తున్న వ్యక్తి మధ్య ఒకరిని నేను ఎంచుకోవాల్సి ఉంటుంది. డెమొక్రాట్లు కూడా మరొక అభ్యర్థిని వెతుక్కోవడం తెలివైన పని. ఇటీవలే ‘ఏబీసీ’ న్యూస్ పోల్ నివేదించినట్లుగా బైడెన్ కానీ, ట్రంప్ కానీ తమ సొంత పార్టీలను విస్తృతంగా ఉత్సాహపరిచే స్థితిలో లేరు.
ఊహాత్మకమైన పోటీ
బైడెన్, ట్రంప్ మధ్య తిరిగి పోటీ జరుగుతుందని ఊహిస్తే గనక, ఇదే పోల్ ప్రకారం 48 శాతం ఓటర్లు ట్రంప్‌కు, 45 శాతం మంది బైడె¯Œ కు అనుకూలంగా ఉంటున్నారు. ఇక స్వతంత్రులతో కలిపి పరిగణిస్తే– ట్రంప్‌కు 50 శాతం మద్దతు లభించగా బైడె¯Œ కు 41 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ట్రంప్ మద్దతుదారులే కాకుండా కోట్లాదిమంది అమెరికన్లు కూడా ఇప్పుడు బైడెన్ పాలన పట్ల సంతో షంగా లేరు. పైగా ఎన్ని లోపాలున్నప్పటికీ, మరోసారి ట్రంప్‌కు అవ కాశం ఇవ్వడం పట్ల కూడా వీరు సుముఖంగా ఉన్నారు.
కానీ ఈ నిర్జీవ పోటీనే మనం ఎదుర్కోవాల్సిన వాస్తవమా? అయితే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఓటర్లు ట్రంప్‌ను కాకుండా మరొకరిని అధ్యక్ష పదవికి ఎంచుకుంటారని నేను ఇప్పటికీ ఆశావాదంతో ఉన్నాను. రిపబ్లికన్ పార్టీ ఎన్నుకునే అధ్యక్ష అభ్యర్థి రిపబ్లికన్లను మాత్రమే కాకుండా, వివిధ వర్గాల అమెరికన్లను కూడా ఉత్సాహ పరిచేట్టుగా ఉండాలి.
-గ్యారీ అబెర్నాతీ, వ్యాసకర్త సంపాదకుడు, కాలమిస్ట్
(‘ద వాషింగ్టన్ పోస్ట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment