
మాస్కో: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య రష్యా జట్టుకు సులువైన ‘డ్రా’నే పడింది. గ్రూప్ ‘ఎ’లో చోటు పొందిన రష్యా జూన్ 14న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టుతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో ఈజిప్టు, ఉరుగ్వే జట్లు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యాలోని 12 వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ విడుదల కార్యక్రమం శుక్రవారం మాస్కోలో అట్టహాసంగా జరిగింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో... దిగ్గజాలు పీలే (బ్రెజిల్), మారడోనా (అర్జెంటీనా) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా (4 జట్లు చొప్పున) విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంటాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గ్రూప్ ‘ఎఫ్’లో ఉండగా... క్రితంసారి రన్నరప్ అర్జెంటీనాకు గ్రూప్ ‘డి’లో చోటు దక్కింది. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ... మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్... ఒకసారి సెమీస్ చేరిన అమెరికా జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలంకాగా... పనామా, ఐస్‌లాండ్ జట్లు తొలిసారి అర్హత సాధించాయి.
ఏ గ్రూప్‌లో ఎవరంటే...
గ్రూప్ ‘ఎ’: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే.
గ్రూప్ ‘బి’: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్.
గ్రూప్ ‘సి’: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్.
గ్రూప్ ‘డి’: అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా.
గ్రూప్ ‘ఇ’: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా.
గ్రూప్ ‘ఎఫ్’: జర్మనీ, మెక్సికో, స్వీడన్, కొరియా.
గ్రూప్ ‘జి’: బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్.
గ్రూప్ ‘హెచ్’: పోలాండ్, సెనెగల్, కొలంబియా, జపాన్.
Comments
Please login to add a commentAdd a comment