ఫ్రెంచ్ మహిళలదే డబుల్స్ టైటిల్ | Garcia, Mladenovic Win French Open Women's Doubles Title | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ మహిళలదే డబుల్స్ టైటిల్

Published Sun, Jun 5 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

Garcia, Mladenovic Win French Open Women's Doubles Title

పారిస్: సొంత గడ్డపై జరిగిన మహిళల డబుల్స్ తుది పోరులో  ఫ్రెంచ్ మహిళల జోడి విజేతగా నిలిచింది.  ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్ జంట కరోలిన్ గ్రాసియా-క్రిస్టినా మ్లాదెనోవిచ్ల ద్వయం 6-3, 2-6, 6-4 తేడాతో రష్యా జోడి ఏకాతిరినా మకారోవా-ఎలీనా వెస్నీనాలపై   గెలిచి తొలి గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ ను టైటిల్ను దక్కించుకుంది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన గ్రాసియా జోడి.. రెండో సెట్ లో ఓటమి పాలైంది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో తిరిగి పుంజుకుని మొదటి గ్రాండ్ స్లామ్ ను తమ ఖాతాలో వేసుకుంది.

రియో ఒలింపిక్స్ లో బరిలోకి దిగడమే లక్ష్యంగా ఈ ఏడాది జోడి కట్టిన గ్రాసియా-మ్లాదెనోవిచ్లు ఖాతాలో మొత్తం నాలుగు టైటిల్స్  ఉన్నాయి. ఈ సంవత్సరం చార్లెస్టన్ టైటిల్తో పాటు, స్టుగార్ట్, మాడ్రిడ్ టైటిల్స్ ను ఫ్రెంచ్ జోడి సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement