
లాంగర్ దగ్గర గంభీర్ శిక్షణ
అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనే లక్ష్యంతో గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ దగ్గర ఈ శిక్షణ సాగుతోంది. ‘చాంపియన్స్ లీగ్ సమయంలో పెర్త్ జట్టు కోచ్‌గా భారత్‌కు వచ్చినప్పుడు లాంగర్‌తో మాట్లాడాను. నా ఆటను ఆయన అద్భుతంగా విశ్లేషించారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటే కచ్చితంగా మెరుగై, తిరిగి భారత జట్టులోకి ఎంపికవుతాననే నమ్మకం ఉంది’ అని గంభీర్ చెప్పాడు.