అక్రా (ఘనా): సాకర్ ప్రపంచకప్‌లో ఘనా ఎప్పుడూ సంచలనమే. గత రెండు ప్రపంచకప్‌లలో అంచనాలకు మించి రాణించిన ఘనా ఇప్పుడు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో ఉన్న తమ జట్టును ప్రోత్సహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 500 మంది అభిమానులను బ్రెజిల్‌కు తీసుకెళుతోంది. అంతేకాదు వీరికి స్పాన్సర్‌గా కూడా వ్యవహరించనుంది. వీలైతే మరింత మంది అభిమానులను కూడా తీసుకెళ్లే అవకాశాలను పరిశీస్తున్నట్లు ఘనా క్రీడల మంత్రి అంక్రా చెప్పారు.
అయితే దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అభిమానులను బ్రెజిల్‌కు తీసుకెళ్లడం డబ్బులను వృథా చేయడమేనని కొందరు ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఘనా జట్టు గ్రూప్ మ్యాచ్‌లకు సన్నద్ధమవుతోంది. మియామీలో తీవ్రంగా సాధన చేస్తోంది. ఘనా జట్టు ఈ నెల 16న తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది.
‘ఘనా’భిమానం...
Published Wed, Jun 11 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement