విజేత జీహెచ్‌ఎస్ | ghs wins mini olympiod title | Sakshi
Sakshi News home page

విజేత జీహెచ్‌ఎస్

Published Fri, Sep 30 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

ghs wins mini olympiod title

సాక్షి, హైదరాబాద్: గోల్కొండ ప్రభుత్వ పాఠశాలల మినీ ఒలింపియాడ్‌లో జీహెచ్‌ఎస్ జట్టు విజేతగా నిలిచింది. గోల్కొండ ఉర్దూ మీడియం స్కూల్ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల కబడ్డీ పోటీల్లో జీహెచ్‌ఎస్ (లంగర్‌హౌస్), జడ్పీహెచ్‌ఎస్ (హైదర్షాకోట్), జీహెచ్‌ఎస్ (గోల్కొండ) జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఖో-ఖో ఈవెంట్‌లో యూపీఎస్, బండ్లగూడ మొదటిస్థానాన్ని దక్కించుకోగా... జీహెచ్‌ఎస్ (గోల్కొండ), జీజీహెచ్‌ఎస్ (లాన్సర్) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

 ఇతర పోటీల విజేతల వివరాలు
 100మీ. స్ప్రింట్: 1. పి. శివలీల (జీహెచ్‌ఎస్, గోల్కొండ), 2. సమ్రిన్ బేగం (జీజీహెచ్‌ఎస్), 3. పి. వీణ (జీహెచ్‌ఎస్, లంగర్‌హౌస్).

 స్కిప్పింగ్: 1. మజీదా బేగం (జీజీహెచ్‌ఎస్, లాన్సర్), 2. రబియా తలోస్సుమ్ (జీజీహెచ్‌ఎస్, లాన్సర్), 3. బి.అనిత (జెడ్పీహెచ్‌ఎస్, హైదర్షాకోట్).

 వాలీబాల్ అండర్-17 బాలురు: 1.జీబీహెచ్‌ఎస్ (గోల్కొండ), 2. జెడ్పీహెచ్‌ఎస్ (హైదర్షాకోట్).
 అండర్-14 బాలురు: 1. జెడ్పీహెచ్‌ఎస్ (హైదర్షాకోట్), 2. జీబీహెచ్‌ఎస్ (గోల్కొండ), 3. యూపీఎస్ (బండ్లగూడ).
 ఫుట్‌బాల్: 1. జీబీహెచ్‌ఎస్, గోల్కొండ.

 

Advertisement
Advertisement