ghs
-
ఆ పుకార్లు నమ్మొద్దు
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీం(జేహెచ్ఎస్) లబ్దిదారులకు వైద్యసేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఈహెచ్ఎస్ సీఈఓ డాక్టర్ పద్మ అన్నారు. నెట్వర్క్ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. వైద్యసేవలు అందడం లేదని వస్తున్న పుకార్లను నమ్మవద్దని లబ్దిదారులకు సూచించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు పొందవచ్చునని సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో ఎలాంటి పరిమితి లేదని, లబ్దిదారుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులు వైద్యసేవలు అందించేందుకు నెట్వర్క్ పరిధిలో 269 ప్రైవేటు, 65 ప్రభుత్వ, 18 కార్పొరేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. 12 లక్షల మంది లబ్డిదారులు ఉండగా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది ఓపీ సేవలు వినియోగించుకున్నారు. 1.70 లక్షల మందికి పైగా ఇన్ పేషెంట్ సర్వీసులు పొందారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్దిదారులు ఆయా ఆస్పత్రులకు నేరుగా వెళ్లి అడ్మిట్ కావొ చ్చు, రోగి వివరాలు ఆయా ఆస్పత్రులు ఆన్ లైన్ ద్వారా ట్రస్ట్‌కు చేరవేస్తాయి. సర్జరీ అనివార్యమైతే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే సరి పోతుంది. త్వరలో బయోమెట్రిక్ విధానంః ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజు సగటు ఓపీ 1100 నుంచి 1200 నమోదు అవుతుండగా, వనస్థలిపురంలో 600 నుంచి 700, వరంగల్ సెంటర్లో 300 నుంచి 400 నమోదు అవుతుంది. రోజుకు 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఆయా కేంద్రాల్లో రోగుల నిష్ప త్తికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. వచ్చిన రోగి ఎక్కువ సేపు నిరీ క్షించాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. కూకట్పల్లి, పాతబస్తీ వెల్నెస్ సెంటర్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సీఈఓ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. -
విజేత జీహెచ్ఎస్
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ ప్రభుత్వ పాఠశాలల మినీ ఒలింపియాడ్‌లో జీహెచ్ఎస్ జట్టు విజేతగా నిలిచింది. గోల్కొండ ఉర్దూ మీడియం స్కూల్ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల కబడ్డీ పోటీల్లో జీహెచ్ఎస్ (లంగర్‌హౌస్), జడ్పీహెచ్ఎస్ (హైదర్షాకోట్), జీహెచ్ఎస్ (గోల్కొండ) జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఖో-ఖో ఈవెంట్లో యూపీఎస్, బండ్లగూడ మొదటిస్థానాన్ని దక్కించుకోగా... జీహెచ్ఎస్ (గోల్కొండ), జీజీహెచ్ఎస్ (లాన్సర్) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇతర పోటీల విజేతల వివరాలు 100మీ. స్ప్రింట్: 1. పి. శివలీల (జీహెచ్ఎస్, గోల్కొండ), 2. సమ్రిన్ బేగం (జీజీహెచ్ఎస్), 3. పి. వీణ (జీహెచ్ఎస్, లంగర్‌హౌస్). స్కిప్పింగ్: 1. మజీదా బేగం (జీజీహెచ్ఎస్, లాన్సర్), 2. రబియా తలోస్సుమ్ (జీజీహెచ్ఎస్, లాన్సర్), 3. బి.అనిత (జెడ్పీహెచ్ఎస్, హైదర్షాకోట్). వాలీబాల్ అండర్-17 బాలురు: 1.జీబీహెచ్‌ఎస్ (గోల్కొండ), 2. జెడ్పీహెచ్ఎస్ (హైదర్షాకోట్). అండర్-14 బాలురు: 1. జెడ్పీహెచ్ఎస్ (హైదర్షాకోట్), 2. జీబీహెచ్‌ఎస్ (గోల్కొండ), 3. యూపీఎస్ (బండ్లగూడ). ఫుట్‌బాల్: 1. జీబీహెచ్‌ఎస్, గోల్కొండ.