
బౌలర్ షమీకి రూ. 2 కోట్ల పరిహారం
ముంబై: గతేడాది గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీకి రూ.2 కోట్ల, 23 లక్షల పరిహారాన్ని అంజేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజాగా వెల్లడించిన నివేదికలో స్పష్టం చేసింది. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్లో జరిగిన వన్డే వరల్డ్కప్లో పాల్గొన్న షమీ.. ఆ తరువాత గాయపడి ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు.
దాంతో షమీకి నష్టపరిహారాన్ని అందజేసి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని బీసీసీఐ భావించింది. దానిలో భాగంగా 2016, జూన్ నెలలో అతనికి ఇచ్చే రూ. 25లక్షల నగుదుతో పాటు, మిగిలిన నష్ట పరిహారాన్ని కూడా షమీకి బీసీసీఐ అందజేసింది. 'గాయం కారణంగా ఐపీఎల్-8 ఎడిషన్కు షమీ దూరం కావడంతో అతను ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. అందుచేత ఓవరాల్ గా రూ. 2 కోట్ల 23 లక్షలను గత నెల్లో షమీకి అందజేశాం' అని బీసీసీఐ పేర్కొంది.