హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’ | Harikrishna draws his match in Tata Steel Chess | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

Published Sat, Jan 28 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్‌్సలోని విక్‌ ఆన్  జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్‌ గిరి (నెదర్లాండ్‌్స)తో జరిగిన 11వ రౌండ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్‌ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement