PentelaHari Krishna
-
హరికృష్ణ పరాజయం
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పెంటేల హరికృష్ణకు తొలి పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన మూడో రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 56 ఎత్తుల్లో ఓడిపోయాడు. మూడో రౌండ్ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే నాలుగో రౌండ్ గేమ్‌లో యు యాంగి (చైనా)తో హరికృష్ణ ఆడతాడు. -
హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్్సలోని విక్ ఆన్ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్ గిరి (నెదర్లాండ్్స)తో జరిగిన 11వ రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. -
హరికృష్ణకు మరో ‘డ్రా’
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. తిమూర్ రద్జబోవ్ (అజర్బైజాన్)తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. హరికృష్ణ ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. -
హరికృష్ణ గెలుపు
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పుంజుకున్నాడు. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో విజయాన్ని దక్కించుకున్నాడు. పావెల్ ఎల్జానోవ్ (ఉక్రెయిన్)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. హరికృష్ణ ప్రస్తుతం 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణ గెలుపు
సాక్షి, హైదరాబాద్: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. అజర్బైజాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 33 ఎత్తుల్లో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. అంతకుముందు ఫాబియానో కరువానా (అమెరికా)తో గురువారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
హరికృష్ణకు ఏడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లు సంపాదించాడు. ప్రపంచ ఏడో ర్యాంకర్ అరోనియన్ (అర్మేనియా)తో చివరిదైన తొమ్మిదో రౌండ్లో తలపడిన హరికృష్ణ 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఆరు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. -
హరికృష్ణ ఓటమి
నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు రెండో పరాజయం ఎదురైంది. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 47 ఎత్తుల్లో ఓడిపోయాడు. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.