హరికృష్ణ గెలుపు | Samkir Open international chess tournament :- Hari Krishna win | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గెలుపు

Published Sat, May 28 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

Samkir Open international chess tournament :- Hari Krishna win

సాక్షి, హైదరాబాద్: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 33 ఎత్తుల్లో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్‌బైజాన్)పై గెలుపొందాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. అంతకుముందు ఫాబియానో కరువానా (అమెరికా)తో గురువారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement