Samkir Open international chess tournament
-
హరికృష్ణకు ఆరో స్థానం
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అజర్బైజాన్లో శనివారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హరికృష్ణ 62 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫార్లి (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం తొమ్మిది గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. హు ఇఫాన్ (చైనా)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రత్యూష గెలుపు: తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. అనస్తాసియా (ఇండోనేసియా)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో ప్రత్యూష 46 ఎత్తుల్లో గెలిచింది. ప్రత్యూష మూడు పాయింట్లతో 20వ ర్యాంక్‌లో ఉంది. -
హరికృష్ణ గెలుపు
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పుంజుకున్నాడు. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో విజయాన్ని దక్కించుకున్నాడు. పావెల్ ఎల్జానోవ్ (ఉక్రెయిన్)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. హరికృష్ణ ప్రస్తుతం 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. -
మూడో రౌండ్లో హరికృష్ణ ఓటమి
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి పరాజయాన్ని చవిచూశాడు. అజర్బైజాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మూడో రౌండ్లో హరికృష్ణ 62 ఎత్తుల్లో సెర్గీ కర్జాకిన్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం హరికృష్ణ ఖాతాలో ఒకటిన్నర పాయింట్లు ఉన్నాయి. -
హరికృష్ణ గెలుపు
సాక్షి, హైదరాబాద్: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. అజర్బైజాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 33 ఎత్తుల్లో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. అంతకుముందు ఫాబియానో కరువానా (అమెరికా)తో గురువారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.