న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి పరాజయాన్ని చవిచూశాడు. అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మూడో రౌండ్‌లో హరికృష్ణ 62 ఎత్తుల్లో సెర్గీ కర్జాకిన్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం హరికృష్ణ ఖాతాలో ఒకటిన్నర పాయింట్లు ఉన్నాయి.