Anish Giri
-
విశ్వనాథన్ ఆనంద్ బోణీ
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్, భారత నంబర్‌వన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుసగా స్విద్లెర్, కార్ల్సన్, క్రామ్నిక్, అనీశ్ గిరి, పీటర్ లెకో, నెపోమ్నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్ ఏడో రౌండ్ గేమ్‌లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ గెల్ఫాండ్ బోరిస్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్‌లో ఆనంద్ 2.5–0.5తో బోరిస్‌పై నెగ్గాడు. -
హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్్సలోని విక్ ఆన్ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్ గిరి (నెదర్లాండ్్స)తో జరిగిన 11వ రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన 13వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 52 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి.