![Herschelle Gibbs Among Applicants as BCCI Seeks High Profile Womens Coach - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/9/Herschelle-Gibbs.jpg.webp?itok=iSBZAWc7)
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవీ కోసం ఇటీవల బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా పని చేసిన వాట్‌మోర్, టామ్ మూడీ, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్ష్‌లీ గిబ్స్ సైతం తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు భారత మహిళ క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.
గిబ్స్ దక్షిణాఫ్రికా తరఫున 90 టెస్టులు, 248 వన్టేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఇటీవల కువైట్ జట్టు కోచ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియాలో 2020లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు కువైట్ జట్టు అర్హత సాధించడానికి అతడే కారణం. అంతేకాకుండా అఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో బాల్క్ లెజెండ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా చేసిన అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment